తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజును పురస్కరించుకొని నాయకులు, కార్యకర్తలు సేవా కార్యక్రమాలు చేశారు. చిత్తూరు జల్లా తెదేపా అధ్యక్షుడు పులివర్తి నాని ఆదేశానుసారం తిరుపతి రూరల్ మండలం పాతూరు గ్రామంలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూజలు నిర్వహించారు. లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుంచి ప్రజలకు సేవలందిస్తున్న ఆరోగ్య శాఖ,పంచాయతీ సిబ్బందికి వారానికి సరిపడా నిత్యావసర వస్తువులను అందించారు.
చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా సామాజిక సేవ - చిత్తూరు జల్లా తెదేపా అధ్యక్షుడు పులివర్తి నాని
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా చిత్తూరులో నాయకులు, కార్యకర్తలు సేవా కార్యక్రమాలు చేశారు.
చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు