చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలో నాటు బాంబులు కలకలం రేకెత్తించాయి. ఓ వ్యక్తి నుంచి పోలీసులు 27 నాటుబాంబులు స్వాధీనం చేసుకున్నారు. బాంబులను వన్యప్రాణుల వేట కోసం వినియోగిస్తున్నట్లు నిందితుడు వెల్లడించాడు.
BOMBS: వెదురుకుప్పంలో నాటు బాంబుల కలకలం.. ముగ్గురు అరెస్ట్ - వెదురుకుప్పంలో నాటు బాంబులను స్వాధీనం చేసుకున్న పోలీసులు
22:10 July 24
20 నాటుబాంబులు స్వాధీనం చేసుకున్న పోలీసులు
అడవి జంతువుల కోసమే ..
గొడుగు చింత రహదారి వద్ద ముగ్గురు వ్యక్తులు పోలీసులకు ఎదురుపడ్డారు. వీరిని చూసిన వేటగాళ్లు పరుగులు తీయడానికి ప్రయత్నించారు. వెంబడించిన పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి 27 నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని స్టేషన్కు తరలించి విచారించారు. మిగిలిన ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. అడవి జంతువులను వేటాడటానికే నాటు బాంబులను తయారు చేసినట్లు చెప్పారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: