Secretariat Staff Protest Against YSRCP leaders harassment: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో సచివాలయ సిబ్బందిపై వైకాపా నాయకుల వేధింపులు మితిమీరుతున్నాయి. వైకాపా గ్రామ నాయకులు, సర్పంచ్ బోడిరెడ్డి ధర్మారెడ్డి కుమారుడు క్రాంతికుమార్ రెడ్డి, అతని అనుచరుడు చిరంజీవి రెడ్డి ఆగడాలు మితిమీరడంతో.. నాలుగు రోజుల క్రితం చంద్రగిరి మండలంలోని గంగుడుపల్లి పంచాయతీ సచివాలయం ఎదుట సచివాలయ సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. మద్యం సేవించి సిబ్బంది, వాలంటీర్లపై వ్యక్తిగత దూషణలకు దిగడం.. మహిళా సిబ్బంది అని చూడకుండా దుర్భాషలాడటంతో పాటు సచివాలయంనుండి బయటకు వెళ్లండని హుకం జారీ చేయడంతో 18 మంది సిబ్బంది ఆందోళన చేపట్టారు. అదేరోజు ఎంపీడీవో రమేష్ బాబుకు పిర్యాదు చేసినా పట్టించుకోలేదని.. కొంతమంది సర్దుకుపోవాలని ఉచిత సలహాలిస్తున్నారని వాపోయారు.
వైకాపా నేతల బెదిరింపులను నిరసిస్తూ సచివాలయ సిబ్బంది ఆందోళన - చంద్రగిరి నియోజకవర్గం
YSRCP leaders harassments చంద్రగిరి నియోజకవర్గంలో వైకాపా నాయకుల తీరుతో సచివాలయ సిబ్బంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం నిరసన చేపట్టిన తమకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని సచివాలయ సిబ్బంది వాపోయారు. వేధింపుల వ్యవహారాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సర్దుకుపోండని ఉచిత సలహాలిస్తున్నారని మండిపడుతున్నారు.
staff
తాజాగా వాలంటీర్లకు చిరంజీవి ఫోన్లు చేసి.. ఉద్యోగాలు ఎలా చేస్తారో చూస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నారని సచివాలయ సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే తాము ఉద్యోగాలు చేయలేమని తేల్చి చెబుతున్నారు.
ఇవీ చదవండి: