కదులుతున్న పాఠశాల వాహనం నుంచి కిందకు దిగే ప్రయత్నంలో, వ్యాన్ కింద పడి ఏడో తరగతి చదువుతున్న విద్యార్ది మృతి చెందాడు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పంలో కొత్తూరు కు చెందిన ధనశేఖర్, ప్రైవేట్ పాఠశాల డ్రైవర్ తో ఉన్న బంధుత్వంతో వ్యాన్ ఎక్కాడు. అనంతరం కదులుతున్న వాహనం నుంచి దిగే క్రమంలో ప్రమాదవశాత్తు వెనుక చక్రాల కింద పడిపోయాడు. తీవ్రగాయాలపాలైన ధనశేఖర్ ను ఆసుపత్రికి తరలించే ప్రయ్తనంలో మార్గమధ్యంలో చనిపోయాడు. ఆసుపత్రికి చేరుకున్న బంధువులు బాలుడి మృతదేహం చూసి బోరున విలపించారు.
స్కూలు వ్యాన్ కింద పడి విద్యార్థి మృతి - చిత్తూరు జిల్లా
బంధుత్వ పరిచయంతో సరదగా పాఠశాల వ్యాన్ ఎక్కి, అదే వ్యాన్ కింద పడి ఏడోతరగతి చదువుతున్న విద్యార్ది దుర్మరణం పాలైయ్యాడు. చిత్తూరు జిల్లాలోని కొత్తూరు గ్రామంలో చోటుచేసుకుంది.
స్కూలు బస్సుకింద పడి విద్యార్థి మృతి