రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల సంక్షేమం కోసం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, 50 శాతం రిజర్వేషన్లతో ఎంతో మేలు జరిగినట్టేనని సామాజిక వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తూ శనివారం చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లెలో సంబరాలు జరుపుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిల విగ్రహాలు, చిత్రపటాలకు పూజలు, పాలాభిషేకం చేసి కొబ్బరికాయలు కొట్టారు. ప్రజలకు మిఠాయిలు పంచారు. గతంలో ఎప్పుడూ ఎస్సీ, ఎస్టీ, బీసీల అభ్యుదయం కోసం ఇలాంటి కార్యక్రమాలను ఎవరు చేపట్టలేదని ఆయా సంఘాల నాయకులు, వైకాపా నాయకులు, కార్యకర్తలు పేర్కొన్నారు. తంబాలపల్లిలో ర్యాలీ నిర్వహించారు.
'వెనుకబడిన తరగతుల కోసం ఆలోచించే నేత జగన్ ఒక్కరే' - chitoor
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమం కోసం ఆలోచించిన జగన్కు, ఆయా సంఘాల కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు.
మా కోసం ఆలోచించావన్నా.. నీకు జైజేలన్నా...
ఇదీ చూడండి:సీఎంఆర్ ఇంటర్నేషనల్ పాఠశాలలో బోనాలు