కరోనా వైరస్ వ్యాప్తి తగ్గాలని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో శతరుద్ర పారాయణం, రుద్రహోమ పూజలను ఘనంగా నిర్వహించారు. ఈవో చంద్రశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో స్వామివారి సన్నిధిలో కలశస్థాపన చేశారు. వేదపండితులు హోమ పూజలు నిర్వహించారు. అనంతరం కలశాలలోని నీటితో స్వామివారికి అభిషేకం చేశారు. భక్తుల దర్శనాలు రద్దు చేయడంతో ఆలయం బోసిపోయింది.
కరోనా నివారణకు శ్రీకాళహస్తిలో శతరుద్ర పారాయణ యాగం - కరోనా వార్తలు
కరోనా వైరస్ వ్యాప్తి తగ్గాలని, లోకకల్యాణార్థం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో శతరుద్ర పారాయణ యాగం, రుద్రయాగం నిర్వహించారు.
యాగం చేస్తున్న పండితులు