శ్రీకాళహస్తీశ్వర ఆలయ ఆవరణలోని ఆస్థాన మండపంలో శివ కామసుందరి దేవి సమేత నటరాజ స్వామికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య స్వామి అమ్మవారి కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అనంతరం ఉత్సవ మూర్తులుగా తీర్చిదిద్ది మాడవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. ఈ విశేష ఉత్సవాలు తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో శ్రీకాళహస్తీశ్వరాలయం శివనామస్మరణతో మార్మోగింది.
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వైభవంగా సభాపతి కల్యాణం - ఆనంద రాత్రి
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆనంద రాత్రిని పురస్కరించుకొని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వైభవంగా సభాపతి కల్యాణం నిర్వహించారు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వైభవంగా సభాపతి కల్యాణం