తిరుమల రెండవ కనుమ రహదారిలో పెను ప్రమాదం తప్పింది. తిరుపతి నుంచి భక్తులతో తిరుమలకు వెళుతున్న ఆర్టీసీ బస్సు పిట్టగోడను ఢీకోని లోయలోకి ఒరిగింది. ద్విచక్రవాహనం అడ్డురావడం, వర్షం పడుతుండటంతో ప్రమాదం సంభవించింది. లోయలోకి ఒరిగిన బస్సు చెట్టుకొమ్మలు తగులుకొని ఆగింది. ప్రమాదానికి గురైన సమయంలో భక్తులు ఆందోళనకు గురయ్యారు. 10 మందికి స్వల్పగాయాలయ్యాయి. ఘాట్ రోడ్లో ప్రయాణిస్తున్న భక్తులు, భద్రతా సిబ్బంది బస్సులోని వారిని బయటకు తీశారు. క్షతగాత్రులను రుయా ఆస్పత్రికి తరలించారు.
తిరుమల ఘాట్రోడ్డులో తప్పిన పెను ప్రమాదం - undefined
తిరుమలలో ఆర్టీసీ బస్సుకి పెను ప్రమాదం తప్పింది. ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి ఈ ఘటన చోటుచేసుకుంది. 10 మందికి స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులను రుయా ఆస్పత్రికి తరలించారు.
తిరుమలలో...ఆర్టీసీ బస్సుకి తప్పిన ప్రమాదం
TAGGED:
తిరుమల