ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రహదారి.. రాజకీయం...

చిత్తూరు - గుడియాత్తం ప్రధాన రహదారి ఆధ్వనంగా మారింది.. నిత్యం వేలాదిగా వాహనాలు రాకపోకలు సాగించే ఈ రహదారిని పట్టించుకునే వారే కరువయ్యారు. నిధుల కొరతతో కనీస మరమ్మతులకు నోచుకోలేదు. ఏ వాహనం కూడా గంటకు 20 కి.మీ. వేగం కూడా వెళ్లలేని పరిస్థితి.

By

Published : Oct 7, 2020, 3:34 PM IST

road damage
అధ్వాన్నంగా రహదారులు

విస్తరణ, అభివృద్ధికి చిత్తూరు జిల్లాలో పది రహదారులను ఎంపిక చేశారు. నిధుల కోసం న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు(ఎన్‌డీబీ) నుంచి అప్పు చేశారు. ఇవన్నీ వెంటనే అభివృద్ధికి నోచుకుంటాయనుకుంటే ఆ పరిస్థితి కనిపించడం లేదు. రాజకీయ కోణంలో... బడా గుత్తేదారులకు అనువుగా ఉండేలా రహదారులను ఎంపిక చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. సాధారణ స్థాయి గుత్తేదారులెవ్వరికీ అవకాశం ఇవ్వకుండా రాయలసీమలో ఇతర జిల్లాలతో కలిపి ప్యాకేజీగా రూపొందించి బడా కాంట్రాక్టర్లే టెండర్లలో పాల్గొనేలా నిబంధనలు మార్పు చేశారని ఆరోపణలు వచ్చాయి. దాంతో ఇద్దరు ప్రజాప్రతినిధులకు చెందిన సంస్థలే టెండర్లలో పాల్గొనే అవకాశం లభించింది. ఇద్దరు కలిసి టెండర్లలో పాల్గొనగా... వారికే ముందస్తు ఒప్పందం మేరకు లభించే అవకాశం ఉండగా.. తీవ్ర విమర్శలతో ప్రక్రియ వాయిదా పడింది. మరోసారి టెండర్లు పిలిచారు. ఇందులో కూడా ఇద్దరికి చెందిన సంస్థలే పాల్గొనే అవకాశం ఉంది. ఇతరులు పాల్గొనే స్థితి జిల్లాలో కనిపించడం లేదని సమాచారం.

● అప్పు ఇచ్చే బ్యాంకు : ఎన్‌డీబీ

● అభివృద్ధి చేసే రోడ్లు : 10

● ఎన్ని కిలోమీటర్లు : 107

● వెచ్చించే నిధులు : రూ.126 కోట్లు

ఇలాంటి రహదారులు జిల్లాలో ఎన్నో ఉన్నాయి. ఓ బ్యాంకు నుంచి అప్పు తీసుకుని జిల్లాలో రహదారుల విస్తరణ, అభివృద్ధి చేపట్టనున్నారు. ఎక్కువగా అధ్వాన స్థితిలో ఉన్న రోడ్లకు మోక్షం కల్పించకుండా రాజకీయ కోణంలో ఇతర వాటికి అవకాశం కల్పించారనే ఆరోపణలు ఉన్నాయి.

మరమ్మతులకు ఎంపిక చేసిన రహదారులివీ..

పూతలపట్టు- రామాపురం, పేటపల్లి- ఐరాల రోడ్డు, దేవదొడ్డి- లక్కనపల్లె, చౌడేపల్లి- వలసపల్లి, చల్లావారిపల్లె- చింతపర్తి, నాగలాపురం- చిన్నపాండూరు, సూళ్లూరుపేట- సంతవేలూరు, దామలచెరువు- నేండ్రగుంట, శ్రీకాళహస్తి- ముసిలిపేడు, బైరాజుకండ్రిగ- రామాపురం రహదారులు ఉన్నాయి.

మరింత పోటీకే రీ టెండర్‌

సింగిల్‌ లైన్‌ రోడ్లకే ఎన్‌డీబీ నిధుల కింద ప్రాధాన్యం ఇచ్చి రెండు వరసలుగా విస్తరణ పనులు చేపట్టనున్నాం. ఇది వరకే టెండర్లు పిలిచాం. మరింత మంది గుత్తేదారులు పాల్గొనేందుకు అవకాశం ఇవ్వాలనే సంకల్పంతో రద్దు చేసి రీటెండర్‌కు ఉత్తర్వులు జారీ చేశాం. చిత్తూరు- గుడియాత్తం రహదారి మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. తదుపరి ప్రతిపాదనల్లో ప్రాధాన్యం ఇస్తాం. - దేవానందం, ఎస్‌ఈ, ఆర్‌అండ్‌బీ శాఖ

ఇదీ చదవండి:

తిరుపతిలో వృథా అవుతున్న స్వర్ణముఖి నదీ జలాలు

ABOUT THE AUTHOR

...view details