ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చంద్రగిరిలో రీపోలింగ్ జరిగే కేంద్రాలివే..! - repolling

సార్వత్రిక ఎన్నికల​కు సంబంధించి చంద్రగిరి నియోజకవర్గంలో ఐదు కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. పాకాల మండలం పులివర్తిపల్లి, రామచంద్రాపురం మండలం కమ్మపల్లి, వేంకట్రామపురం, ఎన్.ఆర్. కమ్మపల్లి, కొత్తకండ్రిగలో రీపోలింగ్ జరగనుంది.

చంద్రగిరిలో రీపోలింగ్ జరిగే కేంద్రాలివే..!

By

Published : May 16, 2019, 7:04 AM IST

ఈ నెల 19న ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ అసెంబ్లీతోపాటు పార్లమెంట్ స్థానానికి రీపోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల్లో అవకవతవకలు జరిగాయని వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గతంలో ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించడంతో జిల్లా ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

పోలింగ్ సమయంలో ఓటు వేసే కంపార్టుమెంట్లలోకి ఇతరులు వెళ్లినట్లు గుర్తించిన ఎన్నికల సంఘం రీపోలింగ్​కు ఆదేశించినట్లు తెలుస్తోంది. పోలింగ్ ముగిశాక సంబంధిత పోలింగ్ కేంద్రాల ప్రిసైడింగ్ అధికారుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందకున్నా... కేంద్ర ఎన్నికల సంఘం రీపోలింగ్​కు ఆదేశించడం చర్చనీయాంశమైంది. రీపోలింగ్​కు సంబంధించి అభ్యర్థులతో సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి ప్రద్యుమ్న తెలిపారు.

చంద్రగిరిలో రీపోలింగ్ జరిగే కేంద్రాలివే..!

ABOUT THE AUTHOR

...view details