చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం భీమవరం అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులపై ఎర్రచందనం స్మగ్లర్లు రాళ్లతో దాడిచేశారు. కూంబింగ్ చేస్తున్న పోలీసులకు 20 మంది స్మగ్లర్లు తారసపడ్డారు. వెంటనే వారు తప్పించుకునేందుకు పోలీసులపై రాళ్లతో దాడికి దిగారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు గాల్లోకి ఒకరౌండ్ కాల్పులు జరిపారు. భయంతో స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలను అక్కడే వదిలేసి అడవిలోకి పారిపోయారు.
పరిసర ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేయగా... ఐదు ఎర్రచందనం దుంగలు లభించాయి. పోలీసులు ఒక స్మగ్లర్‌ని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారికోసం అదనపు బలగాలతో ముమ్మర గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులపై ఎర్రచందనం స్మగ్లర్ల రాళ్ల దాడి
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం భీమవరం అడవుల్లో కూంబింగ్ నిర్వహించిన పోలీసులపై ఎర్రచందనం స్మగ్లర్లు రాళ్లదాడి చేశారు. పోలీసులు గాల్లోకి కాల్పుల చేయటంతో అడవిలోకి పారిపోయారు.
పోలీసులపై ఎర్రచందనం స్మగ్లర్ల రాళ్ల దాడి
ఇదీ చదవండి