చిత్తూరు జిల్లాలోని శేషాచల అటవీ ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లర్లు బరితెగిస్తున్నారు. టాస్క్ఫోర్స్, అటవీ శాఖ అధికారులు, సివిల్ పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా... వారిని పూర్తిస్థాయిలో అడ్డుకోలేకపోతున్నారు. బుధవారం రాత్రి తలకోన అటవీ ప్రాంతంలో ఉట్లదింపదడి వద్ద కూంబింగ్ నిర్వహిస్తున్న అటవీశాఖ అధికారులకు సుమారు 30 మంది తమిళ స్మగ్లర్లు తారసపడ్డారు. తమను చూసి దట్టమైన అడవిలోకి పారిపోయిన స్మగ్లర్లను వెంబడించారు అధికారులు.
ఆరుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు
చిత్తూరు జిల్లాలోని తలకోన అటవీ ప్రాంతంలో బుధవారం కూంబింగ్ చేపట్టిన అటవీ శాఖ అధికారులకు... ఎర్రచందనం స్మగ్లర్ల ముఠా కంటపడింది. వారిని వెంటాడిన అధికారులు... ఆరుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
red sandalwood smugglers
చివరికి ఆరుగురిని పట్టుకుని అరెస్ట్ చేశారు అధికారులు. వీరు తమిళనాడులోని తిరువన్నామళైకి చెందిన వారిగా గుర్తించారు. పట్టుబడిన స్మగ్లర్లపై కేసు నమోదు చేశామని... ఎర్రచందనం దుంగలను భాకరాపేట ప్రధాన కార్యాలయానికి తరలించినట్లు ఎఫ్.ఆర్.ఓ పట్టాభి ఈటీవీ భారత్కు వెల్లడించారు. పారిపోయిన స్మగ్లర్ల కోసం కూంబింగ్ ముమ్మరం చేసినట్లు తెలిపారు.