చిత్తూరు జిల్లా పుత్తూరులో వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులకు జలకళ సంతరిచుకుంది. వర్షపు నీటిని పుత్తూరు మున్సిపల్ అధికారులు ఒడిసి పట్టాలన్న ఆలోచనతో ఎస్ఎస్ బ్యాంకులోకి నింపుతున్నారు. నాలుగేళ్ల క్రితం వెస్ట్ బ్యాంక్ నింపేందుకు ప్రత్యేకంగా రూ.1.10 కోట్లతో నిర్మించగా చెరువులో నీటిని ట్యాంకుల్లో నింపుతున్నారు. ట్యాంక్ నిండితే తాగునీటి సమస్య దాదాపుగా పరిష్కారమవుతుందని అధికారులంటున్నారు. చాలా రోజుల తరువాత సంపూర్ణంగా నిండిన చెరువును ఆస్వాదించేందుకు కట్టపైకి ప్రజలు తరలివచ్చారు.
'చెరువు నీటిని దాచేసుకుంటాం' - చిత్తూరు
ఇటీవల కురుస్తున్న వర్షాలతో చెరువులు పుష్కలంగా నిండుతున్నాయి. వాన నీటిని ఒడిసి పట్టి తమ తాగునీటి సమస్యను తీర్చుకోవాలని చిత్తూరు జిల్లాలోని పుత్తూరు పురపాలక సంస్థ ఆ నీటిని ట్యాంక్‌లోకి చేరుస్తోంది.
వర్షపు నీటిని ఒడిసి పడుతున్న పురపాలక సంస్థ