స్వామి వారి సేవలో సినీ నటి రాధిక దంపతులు - sarath
ఉగాది పర్వదినాన తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. స్వామి వారి సేవలో సామాన్య ప్రజలతో పాటు స్వామి వారిని సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
స్వామి వారిని దర్శించుకున్న రాధిక దంపతులు
తిరుమల శ్రీవారిని సినీ నటులు శరత్, రాధిక దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్న నటులకు ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. వీరితో పాటు సీనియర్ నటుడు రాంకీ... స్వామి వారిని దర్శించుకున్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి, తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు శరత్ వెల్లడించారు.