ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సమరాంధ్ర @ 2019.. నగరిలో ఎవరు నెగ్గునో!

నగరిలో ఎన్నికల ప్రచారం తారస్థాయికి చేరుకుంది. అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు ఒకరినిమించి మరొకరు ప్రచారం చేస్తున్నారు.

నేతల ప్రచారం

By

Published : Mar 24, 2019, 7:42 PM IST

పుత్తూరులో నేతల ప్రచారం
నగరిలో ఎన్నికల ప్రచారం తారస్థాయికి చేరుకుంది. అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు ఒకరినిమించి మరొకరు ప్రచారం చేస్తున్నారు. తమకే ఓటు వేయాలని పార్టీ గుర్తులను... ఓటర్లకు గుర్తు చేస్తున్నారు. నాయకత్వాలు ఇచ్చిన హామీలను వివరించారు. అభివృద్ధి కావాలంటే.. తమనే గెలిపించాలని విజ్ఞప్తులు చేశారు.

తెదేపా

పుత్తూరు పట్టణం 10, 17, 13 వార్డుల్లో తెదేపా అభ్యర్థి గాలి భాను ప్రకాశ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో తెదేపాకే ఓటు వేసి గెలిపించాలన్నారు. పుత్తూరులో తాగునీటి సమస్య పరిష్కారానికి తన తండ్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు 136 కోట్ల రూపాయలు మంజూరు చేయించారని గుర్తుచేశారు.

వైకాపా

నగరి నియోజకవర్గం పుత్తూరులో వైకాపా అభ్యర్థి రోజా ప్రచారం చేశారు. పట్టణంలోని 14,15,16 వార్డులో ఇంటింటికి వెళ్లి ఓట్లను అభ్యర్థించారు.

భాజపా

పుత్తూరులో పార్టీ కార్యకర్తల సమావేశానికి భాజపా అభ్యర్థి నిషేధ హాజరయ్యారు. కేంద్రంలో మోదీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. భాజపా గెలుపే లక్ష్యంగా అందరూ కృషి చేయాలని సూచించారు.

ఇది కూడా చదవండి.

చిత్తూరు జిల్లాలో 90 నామినేషన్లు దాఖలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details