ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీ కల్యాణ వేంకటేశ్వరాలయంలో పుష్పయాగం - చిత్తూరు తాజా వార్తలు

చిత్తూరు జిల్లా శ్రీ‌నివాస ‌మంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరాలయంలో స్వామివారికి పుష్పయాగం నిర్వహించారు. ఈ యాగం చేయడం వల్ల సమస్త దోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు.

pushpa yagam at Sri Kalyana Venkateswara Temple
శ్రీ కల్యాణ వేంకటేశ్వరాలయంలో పుష్పయాగం

By

Published : Apr 6, 2021, 8:48 PM IST

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పుష్పయాగం నిర్వహించారు. కొవిడ్ వ్యాప్తి నేప‌థ్యంలో ఈ కార్యక్రమాన్ని ఆల‌యంలోనే ఏకాంతంగా జరిపారు. తితిదే అనుబంధంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆల‌యంలో మార్చి 2 నుంచి 10వ తేదీ వ‌ర‌కు బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల సందర్భంగా ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారని.. ఈ యాగం నిర్వహణతో సమస్త దోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు.

పుష్పయాగంలో ఉపయోగించిన పువ్వులు

ఉదయం 10 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. పంచామృతాలతో అభిషేకం చేశారు. మధ్యాహ్నం పుష్పయాగం జ‌రిగింది. ఇందుకోసం దాదాపు 3 ట‌న్నుల పుష్పాల‌ను వినియోగించారు. వీటిని త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల నుంచి దాత‌లు విరాళంగా అందించారు.

ABOUT THE AUTHOR

...view details