చిత్తూరు జిల్లా బుచ్చినాయుడుకండ్రిగ మండల కేంద్రంలో కూరగాయలు కొనుగోలు చేసేందుకు స్థానికులు భారీగా తరలి వచ్చారు. ఎక్కువ సంఖ్యలో ప్రజలు మార్కెట్కు రావడం ఫలితంగా స్థానికంగా ఉన్న పోలీసులు సామాజిక దూరం పాటించాలని సూచించారు. క్యూలో నిల్చుని కాయగూరలు కొనుగోలు చేశారు.
పోలీసుల సూచనతో క్యూలైన్లో నిల్చుని కొనుగోలు - corona effect on people
ప్రభుత్వం సామాజిక దూరం పాటించాలని చెబుతున్నా... కొందరు నిబంధనలు పాటించడం లేదు. నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసేందుకు దుకాణాలకు, మార్కెట్లకు భారీగా తరలివస్తున్నారు. ఫలింతంగా కరోనా అత్యంత వేగంగా వ్యాపించే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
క్యూలో నిల్చుని కూరగాయలు కొనుగోలు చేస్తున్న ప్రజలు