ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాకీ ప్రధానోపాధ్యాయుడు వద్దు బాబోయ్!! - chittoor

చిత్తూరు జిల్లా జవునిపల్లి సన్పెన్షన్​కు గురైన తర్వాత విధుల్లోకి వచ్చిన ప్రధానోపాధ్యాయుడిని గ్రామస్థులు, విద్యార్థులు అడ్డుకున్నారు.

పాఠశాల

By

Published : Sep 12, 2019, 8:40 PM IST

మాకీ ప్రధానోపాధ్యాయుడు వద్దు బాబోయ్

చిత్తూరు జిల్లా వి.కోట మండల పరిధిలోని జవునిపల్లిలో ఉన్న జడ్పీ హై స్కూల్ లో హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్న నిస్సార్అహ్మద్... విద్యార్థినుల పట్ల దురుసుగా, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని డీఈవో కి ఫిర్యాదు చేయడంపై మూడు సంవత్సరాల క్రితం విధుల నుంచి తొలగించారు. అతని స్థానంలో స్వామి కన్నన్​ని నియమించారు. మళ్లీ పాఠశాలలో విధులు నిర్వర్తించటానికి పాత ప్రిన్సిపల్ రాగా... 'గో బ్యాక్ హెడ్ మాస్టర్' అంటూ విద్యార్థులు స్కూల్ కి తాళాలు వేసి ధర్నా నిర్వహించారు. తమకు ఈ సార్ వద్దని నినాదాలు చేశారు. డీఈవో స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details