నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సోమశిల యాకరలపాడు వద్ద ఎర్రచందనం అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. ఏడు దుంగలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 7 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. బొప్పాయి లోడును అనుమానంతో తనిఖీ చేయగా... ఎర్ర చందనం దుంగలు బయటపడ్డాయన్నారు. డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు మరో ఐదుగురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. ఇంకో నలుగురు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి 70 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.
సోమశిల వద్ద ఎర్ర చందనం దుంగలు స్వాధీనం - nelore
నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సోమశిల యాకరలపాడు వద్ద ఏడు ఎర్ర చందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సోమశిల వద్ద ఏర్ర చందనం దుంగలు స్వాధీనం