పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఈమేరకు తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఆదేశాల మేరకు ఆర్టీసీ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, ప్రైవేటు లడ్జీలు , తూర్పు పోలీస్ స్టేషన్ సబ్ డివిజన్ పరిధిలో విస్తృత తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వారిని విచారించి వివరాలు సేకరించారు.
తిరుపతి రైల్వేస్టేషన్లో పోలీసుల తనిఖీలు - railway station
తిరుపతి ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్ తదితర రద్దీ ప్రాంతాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. అనుమానస్పదంగా సంచరిస్తున్న వారిని అదుపులోకి తీసుకొని విచారించారు.
తిరుపతి రైల్వేస్టేషన్లో పోలీసుల తనిఖీలు