ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డ్రైవర్స్ కాలనీలో కార్డెన్ సెర్చ్​ - l Drivers Colony.

డ్రైవర్స్ కాలనీలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. 22 బైకులను, రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.

Police conducted a cordon search under the direction of Palmaneru DSP Arifullah in Chittoor District Gangavaram Mandal Drivers Colony.

By

Published : Aug 18, 2019, 5:45 PM IST

కార్డెన్ సర్చ్​లో 22 బైకులు,2 ఆటోలు స్వాధీనం..

చిత్తూరు జిల్లా గంగవరం మండలం డ్రైవర్స్ కాలనీలో పలమనేరు డీఎస్పీ ఆరిఫుల్లా ఆధ్వర్యంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలమనేరు, గంగవరం, పుంగనూరు సీఐలతోపాటు 8 ఎస్సైలు, , 120 మంది ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి ఇంటి వద్ద తనిఖీ చేసి ..సరైన ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. ఈ కాలనీలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి నివాసం ఉండటంతో, ఎస్పీ ఆదేశాల మేరకు కార్డెన్ సెర్చ్ నిర్వహించామని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికల సమాచారంతో కాలనీలో సుమారు 500 నివాసాల్లో వ్యక్తుల వివరాలు సేకరించామని చెప్పారు. ఇందులోభాగంగా 22 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details