ఆనందోత్సహాల మధ్య ఊరిలో జాతర నిర్వహించుకుంటున్న సమయంలో పిడుగు పడి ఇద్దరు మృతి చెందారు. చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం బసవరాజకండ్రిగలో జరిగింది. సాయంత్రం వర్షం మొదలై ఒక్క సారిగా భారీ శబ్ధాలతో పిడుగు పడింది. ఆ సమయంలో గొర్రెలు మేపుకుంటూ మామిడి చెట్టు కింద నిల్చున్న శశికుమార్, నాగమ్మ అక్కడికక్కడే మృతి చెందారు.
చిత్తూరు జిల్లాలో పిడుగుపాటు.. గురై ఇద్దరు మృతి - chittoor
చిత్తూరు జిల్లా బసవరాజకండ్రిగలో విషాదం చోటుచేసుకుంది. పిడుగుపాటుకు గురై ఇద్దరు చనిపోయారు.
పిడుగు