పొట్ట కూటి కోసం పగులురాత్రి అని తేడా లేకుండా పనిచేశాడు. కష్టాన్ని నమ్ముకున్నాడు. కానీ మట్టి రుపంలో వచ్చిన మృత్యువు అతన్ని తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... సుబ్రమణ్యం అనే వ్యక్తి రాత్రి 2 గంటల నుంచి ఉదయం 7 గంటల ప్రాంతంలో చెన్నై తిరుపతి రైల్వే మార్గం ఎల్ సి నెంబర్ 63 బ్రిడ్జి నిర్మాణ పనుల్లో మట్టి చదును చేస్తున్నాడు. ప్రమాదవశాత్తూ పై నుంచి మట్టి జారిపడటంతో అక్కడిక్కడే మృతి చెందాడు. పక్కనే ఉన్న శిఖామణి అనే వ్యక్తికి గాయలవడంతో ఆసుపత్రికి తరలించారు. సుబ్రమణ్యం మృతితో ఆ కుటుంబంలో విషాదపుఛాయులు అలుముకున్నాయి.
మట్టి కుప్ప పడి వ్యక్తి మృతి - చిత్తూరు
బ్రిడ్జి నిర్మాణ పనుల్లో మట్టి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం తడుకలో చోటుచేసుకుంది.
మట్టికుప్ప మీదపడి వ్యక్తి మృతి