తిరుపతిలో కరోనా పరీక్షల కోసం వస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలోని స్విమ్స్, ప్రసూతి ఆసుపత్రిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా పరీక్షల కోసం వచ్చిన వ్యక్తి పేరు నమోదు చేసే ఐసీఎంఆర్ సర్వర్ ప్రసూతి ఆసుపత్రిలో మొరాయించింది. పరీక్షల కోసం ఇచ్చిన టోకెన్లతో ఆసుపత్రి ఆవరణలో ప్రజలు వేచిచూస్తున్నారు.
మొరాయించిన సర్వర్.. కరోనా పరీక్షల కోసం ఎదురుచూపులు - tirupati corona news
తిరుపతిలో కరోనా పరీక్షల కోసం వచ్చిన ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కరోనా పరీక్షల కోసం వచ్చిన వ్యక్తి పేరు నమోదు చేసే ఐసీఎంఆర్ సర్వర్ మొరాయించిగా.. ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 1186 కేసులు నమోదు కాగా.. తిరుపతి నగరంలో 680 పాజిటివ్ కేసులు ఉన్నాయి.
మొరాయించిన సర్వర్ ... కరోనా పరీక్షల కోసం ప్రజల పడిగాపులు
చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 1186 కేసులు నమోదవగా తిరుపతి నగరంలో 680 పాజిటివ్ కేసులు ఉన్నాయి. పాజిటివ్ కేసుల సంఖ్య అధికంగా ఉండటంతో నగరవాసులు కరోనా పరీక్షల కోసం బారులు తీరుతున్నారు.
ఇదీ చదవండి