రాయలసీమ మూడు జిల్లాల పర్యటనలో చాలా సమస్యలు తన దృష్టికి వచ్చాయని జనసేనాని పవన్ చిత్తూరులో తెలిపారు. ఈ ప్రాంతానికి పరిశ్రమలు రాకపోవటానికి కొన్ని కుటుంబాలే కారణమని ఆరోపించారు. సీమకు పూర్వవైభవం తీసుకువచ్చే బాధ్యతను జనసేన తీసుకుంటుందని హామీ ఇచ్చారు.రాయలసీమ అంటే ఫ్యాక్షనిజం అనే ముద్ర పడిందని ఆవేదన చెందారు.పోతులూరి వీరబ్రహ్మం, అన్నమయ్య, వెంగమాంబలాంటి పుణ్యమూర్తులు తిరిగిన నేలను.. ముఠా కక్షలతో అపవిత్రం చేశారని అసహనం వ్యక్తం చేశారు. జనసేన అధికారంలోకి వస్తే మూతపడిన పరిశ్రమలను తిరిగి తెరిపిస్తామని భరోసా కల్పించారు. ఏడాదికి 75 శాతం మంది పట్టభద్రులు అవుతుంటే.. 50 శాతం మందికీఉద్యోగాలు రావటం లేదన్నారు. వీటన్నిటినీ మార్చాలంటే బాధ్యతాయుతమైన రాజకీయ వ్యవస్థను స్వాగతించటం ఒక్కటే పరిష్కారమని ప్రజలకు స్పష్టం చేశారు.