చిత్తూరు జిల్లా పుత్తూరులో ఆరేళ్ల క్రితం రవీంద్ర భారతి పాఠశాలను ప్రారంభించారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో 160 మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే ఎలాంటి ప్రకటన లేకుండా యాజమాన్యం పాఠశాలను మూసివేసింది. దాంతో విద్యార్థుల తల్లితండ్రులు ఏఎస్ఎఫ్ఐ నాయకులతో కలసి పాఠశాల ఎదుట ధర్నా చేపట్టారు. ఇప్పటికిప్పుడు పాఠశాలను మూసివేస్తే తమ పిల్లల భవిష్యత్తు ఏం కావాలని తల్లితండ్రులు యాజమాన్యాన్ని ప్రశ్నించారు. కనీసం టీసీలు కూడా ఇవ్వకుండా యాజమాన్యం ఇలా చేతులెత్తేయడంతో ఇప్పుడు వారి పరిస్థితి ఏంటని, విద్యార్థులకు వెంటనే న్యాయం చేయలని ఏఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...ఇది ప్రైవేటు సంస్థల నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమని... ఇలాంటి సంస్థలపై కఠిన చర్యలు తీసుకుని, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. తమకు ఏలాంటి సమాచారం ఇవ్వకుండా పాఠశాల సిబ్బంది వ్యవహరించిన తీరుపై తల్లితండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రకటన లేకుండా స్కూల్ మూసివేత.. రోడ్డునపడ్డ విద్యార్థులు - chithoor
ప్రకటన లేకుండా పాఠశాలను మూసివేయడంతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. లాభాలు రావడం లేదనే కారణంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు యాజమాన్యం చెబుతోంది. తమ పిల్లల భవిష్యత్తు ఏం కావాలని తల్లితండ్రులు నిరసన చేపట్టారు. ఇదీ చిత్తురు జిల్లా పుత్తూరులోని రవీంద్ర భారతి పాఠశాల నిర్వాకం.
ధర్నా చేస్తున్న విద్యార్థి సంఘాలు
ఇదీ చూడండిరేపటి నుంచి కుప్పంలో చంద్రబాబు పర్యటన
Last Updated : Jul 1, 2019, 2:15 PM IST