ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దేశీ ధాన్యంతో.. తిరుమలేశుడికి నైవేద్యం!

దేశీ రకం ధాన్యంతో తిరుమల శ్రీవారికి నైవేద్యం సమర్పించినట్లు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. దేశీ రకాలతో ప్రకృతి వ్యవసాయం చేసేలా.. రైతులను ప్రోత్సహిస్తామని ఆయన వివరించారు. దశల వారీగా అన్నదానం, లడ్డూ ప్రసాదాల తయారీకి వినియోగిస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

ttd chairman yv subbareddy
వైవీ సుబ్బారెడ్డి

By

Published : May 1, 2021, 12:00 PM IST

Updated : May 1, 2021, 5:56 PM IST

దేశీ రకం విత్తనాలు, ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ధాన్యంతో.. తిరుమలలో స్వామివారికి నైవేద్యం సమర్పించినట్లు తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. ఇకపై ఈ తరహా బియ్యంతోనే ప్రసాదాలు తయారు చేయనున్నట్లు వెల్లడించారు. పూర్వం మాదిరిగా అత్యంత నాణ్యమైన నైవేద్యం స్వామివారికి పెట్టినట్లు చరిత్రలో మిగిలిపోతుందన్నారు. ప్రకృతి వ్యవసాయంతో తయారు చేసిన అన్నప్రసాదాన్ని స్వీకరించిన భక్తులు.. సంతోషం వ్యక్తం చేశారన్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆదర్శ రైతులను గుర్తించాలని అధికారులకు సూచించామని సుబ్బారెడ్డి చెప్పారు. దేశీ రకాలతో, ప్రకృతి వ్యవసాయం చేసేలా రైతులను ప్రోత్సహిస్తామన్నారు. దశలవారీగా అన్నదానం, లడ్డూ ప్రసాదాల తయారీలో సైతం వీటినే వినియోగిస్తామని తెలిపారు. అన్నప్రసాదాలతో పాటూ ప్రయోగాత్మకంగా లడ్డూ ప్రసాదాలను తయారు చేయగా.. దేశీ రకాలతో సిద్ధం చేసిన, సాధారణ లడ్డూలకు వ్యత్యాసాన్ని పరిశీలించారు.

Last Updated : May 1, 2021, 5:56 PM IST

ABOUT THE AUTHOR

...view details