ONLINE BETTING GANG ARREST: ఆన్లైన్లో బెట్టింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు చేశారు చిత్తూరు పోలీసులు. సామాజిక మాధ్యమాలే వేదికగా.. బెట్టింగ్లో మోసాలు చేస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు. పెట్టుబడి పెడితే రెండింతల ఆదాయం వస్తుందని నమ్మబలికి.. మోసాలకు పాల్పడినట్లు తెలిపారు.
చిత్తూరు నగరానికి చెందిన నితీష్ రెడ్డి అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆన్లైన్ బెట్టింగ్లో రూ. 26 లక్షల వరకు మోసపోయాడు. దీనిపై చిత్తూరు ఒకటో పట్టణ పోలీసులను ఆశ్రయించడంతో.. వారు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దర్యాప్తులో భాగంగా నిందితులు నేరానికి ఉపయోగించిన సోషల్ మీడియా ఖాతాలను, వివిధ బ్యాంకు ఖాతాల్లోని మెుత్తం రూ. 1.27 కోట్ల సొమ్మును ఫ్రీజ్ చేశారు.