ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సత్యవేడులో నివర్ తుపాను బీభత్సం

By

Published : Nov 26, 2020, 4:29 PM IST

చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని ఏడు మండలాల పరిధిలో.. నివర్ తుపాను ప్రభావం అధికంగా ఉంది. ప్రధాన రోడ్లపై వరదనీటి ప్రవాహంతో.. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గాలి బీభత్సానికి చెట్లు విరిగి పడి.. కొన్నిచోట్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

satyavedu situation with nivar cyclone
నివర్ తుఫాను ధాటికి రోడ్ల పరిస్థితి

తమిళనాడుకు సమీపంలో ఉన్న చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గాన్ని నివర్ తుపాన్ భారీగా ప్రభావితం చేసింది. నిన్న ఉదయం నుంచి ఈరోజు వరకు కురిసిన వర్షానికి.. వరదనీరు రోడ్లపై పోటెత్తింది. వరదయ్యపాలెం నుంచి కాళహస్తికి వెళ్లే ప్రధాన మార్గం జలమయమైంది. నాగలాపురం, పీవీపురం సమీపంలోని గొడ్డేరు, రాళ్లవాగు గుండా వరదనీరు ప్రవహిస్తోంది. తవణంపల్లి, యాదమరి, బంగారుపాలెం, ఐరాల, పూతలపట్టు మండలాల్లో.. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. అధికారులు ఎప్పటికప్పుడు గ్రామాల్లో పర్యటించి.. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

నివర్ తుఫాను ధాటికి రోడ్ల పరిస్థితి

నారాయణవనం మండలంలోని పాలమంగలం వద్ద అరుణానది ఉద్ధృతి ఎక్కువగా ఉండగా.. 4 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. సత్యవేడు, బుచ్చినాయుడు కండ్రిగ మండలాల్లో గాలి బీభత్సవానికి చెట్లు విరిగి కరెంటు తీగలపై పడి.. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరించడంతో.. కొంతవరకు ఉపశమనం కలుగుతోంది. సత్యవేడు నియోజకవర్గంలోని ఏడు మండలాల పరిధిలో సుమారు 950 ఎకరాలకు పైగా.. వరి, వేరుశనగ పంటలు నీటమునిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details