ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అట్టహాసంగా ప్రారంభమైన 'నిడ్జమ్‌-2019'

17వ జాతీయ అంతర్ జిల్లాల జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు తిరుపతిలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తారకరామ మైదానంలో 3 రోజులపాటు క్రీడాపోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీలకు 5 వేల మంది క్రీడాకారులు వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చారు.

By

Published : Nov 23, 2019, 12:19 PM IST

Published : Nov 23, 2019, 12:19 PM IST

nidjam-2019-games-in-tirupati

అట్టహాసంగా ప్రారంభమైన 'నిడ్జమ్‌-2019'

17వ జాతీయ అంతర్ జిల్లాల జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు'నిడ్జమ్‌-2019'తిరుపతిలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయానికి సంబంధించిన తారకరామ మైదానం ఈ పోటీలకు వేదికయ్యింది.మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,అవంతి శ్రీనివాస్,నారాయణస్వామి,ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్ రోజాపోటీలను ప్రారంభించారు.క్రీడాపోటీల్లో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల నుంచి5వేల మంది అథ్లెట్స్‌ తరలివచ్చారు. 14ఏళ్లలోపు విభాగంలో5క్రీడాంశాలు, 16ఏళ్ల లోపు విభాగంలో12క్రీడాంశాల్లో అథ్లెట్స్‌ సత్తా చాటనున్నారు.పరుగు పందెం,లాంగ్ జంప్,హైజంప్,షాట్ పుట్,జావెలిన్ త్రో, డిస్కస్ త్రో వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. 3 రోజులపాటు ఈ పోటీలు జరగనున్నాయి. క్రీడలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇస్తోందని మంత్రులు అన్నారు.

ABOUT THE AUTHOR

...view details