LOKESH FOURTH DAY YUVAGALAM : రాష్ట్రంలోని యువత, మహిళల్లో చైతన్యం తీసుకురావడానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నాలుగో రోజు కొనసాగుతోంది. గత మూడు రోజుల పాటు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో సాగిన పాదయాత్ర.. నేడు కుప్పంలోని చెల్దిగానిపల్లి నుంచి ప్రారంభమై పలమనేరు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. మధ్యాహ్నం జీ కళాశాలలో యువతతో లోకేశ్ సమావేశం అవుతారు. తర్వాత కూరగాయల మార్కెట్‌లో రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. రాత్రికి కృష్ణాపురం టోల్‌గేట్ సమీపంలో లోకేశ్ బస చేయనున్నారు.
కుప్పంలో ముగిసిన లోకేశ్ పాదయాత్ర.. నాలుగవ రోజు ఉత్సాహంగా పలమనేరులోకి యువగళం.. - నాలుగో రోజు లోకేశ్ యువగళం పాదయాత్ర
LOKESH FOURTH DAY YUVAGALAM: నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నాలుగో రోజు కుప్పం నియోజకవర్గం చెల్దిగానిపల్లి నుంచి ప్రారంభమై పలమనేరు నియోజకవర్గంలోకి ప్రవేశించింది.

LOKESH FOURTH DAY YUVAGALAM
కుప్పం నియోజకవర్గంలో 29కిలోమీటర్లు : చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర ముగిసింది. మూడు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో 29 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు. కుప్పం, రామకుప్పం, శాంతిపురం, గుడిపల్లె మండలాల్లో పాదయాత్ర సాగింది
ఇవీ చదవండి: