రాష్ట్రంలో ఒక్కసారి ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వైకాపా..ఇప్పుడు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తోందని చిత్తారు జిల్లా నగరి తెదేపా ఇంఛార్జ్ గాలి భానుప్రకాష్ అన్నారు. పుత్తూరు 18, 19వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థినిలకు మద్దతుగా ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వైకాపాకు ఓటు వేస్తే..ఆరాచానికి చోటు ఇచ్చినట్టే అని ఆయన వ్యాఖ్యానించారు. ఆ పార్టీకి ఓటేసి మోసపోవద్దని ఆయన అన్నారు.
'వైకాపాకు ఓటు వేస్తే..ఆరాచానికి చోటు ఇచ్చినట్టే ' - పుత్తూరులో తెదేపా ప్రచారం
వైకాపా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఉంటే పోటీ చేసి గెలిచేదని .. బలవంతపు ఏకగ్రీవాలతో కాదని చిత్తారు జిల్లా నగరి తెదేపా ఇంఛార్జ్ ఎద్దేవా చేశారు. పుత్తూరు 18, 19వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థినిలకు మద్దతుగా గాలి భానుప్రకాష్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

పుత్తూరులో తెదేపా ప్రచారం
Last Updated : Mar 6, 2021, 10:54 AM IST