వైకాపా నేతలు ప్రజలను బెదిరించి ఓట్లు వేయించుకున్నారని చిత్తూరు జిల్లా నగరి నగరి నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జి గాలి భాను ప్రకాశ్ ఆరోపించారు. ప్రజలను మెప్పించి ఓట్లు అడగాలని హితవు పలికారు. బుధవారం పుత్తూరు రూరల్ మండలం గోపాలకృష్ణాపురం గ్రామంలో గాలి భాను ప్రకాశ్ పర్యటించారు. వైకాపా పాలనలో రాష్ట్రం ఏమాత్రం అభివృద్ధి చెందలేదని ఆరోపించారు. ఇసుక,మద్యం,పెట్రోల్, నిత్యావసర వస్తువులు ధరలు పెంచుకుంటూపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరల పెంపుతో పేదలు, సామాన్యులు అవస్థలు ఎదుర్కొంటున్నారని విచారం వ్యక్తం చేశారు.
బెదిరించడం కాదు..మెప్పించి ఓట్లు అడగండి: గాలి భాను ప్రకాశ్ - tdp leader gali bhanu on ysrcp
ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు తీసేస్తామని, కేసులు పెడతామని బెదిరించి ఓట్లు వేసుకోవడం కాదు.. చేతనైతే ప్రజలను మెప్పించి ఓట్లు సంపాదించాలని చిత్తూరు జిల్లా నగరి నగరి నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జి గాలి భాను ప్రకాశ్ అన్నారు.
nagari constituency tdp incharge gali bhanu prakashnagari constituency tdp incharge gali bhanu prakash