చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు వంకలు, వాగులు పారి చెరువులు పూర్తిస్థాయిలో నిండాయి. మూలపల్లి, భీమవరం ప్రాంతాలలో రైతులకు కొత్త సమస్య ఎదురైంది. చెరువు నిండింది అన్న ఆనందం కన్నా.. గ్రామానికి రోడ్డు లేకుండా పోతుంది అన్న వేదన నెలకొంది.
ఊట నీటితో గ్రామస్థుల అవస్థలు - rains at chittor district
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని చెరువులు కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు జలకళను సంతరించుకున్నాయి. రైతులలో చెరువు నిండింది అన్న ఆనందం కన్నా ...... చెరువు ఊట నీటితో గ్రామానికి రోడ్డు లేకుండా పోయిందని ఆవేదన నెలకొంది.
మూలపల్లి చెరువు కట్ట కింద నివాసం ఉన్న ప్రజలకు ఊట నీటి వల్ల ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో కాలువలు లేనందువల్ల నీరు గ్రామంలోకి రావడం ఉన్న ఒక్క దారిపైకి వస్తోంది. రోడ్డు గతుకుల మయం అయ్యి రాకపోకలు స్తంభించే అవకాశం ఉందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. అధికారులు స్పందించి ఊట నీరు వెళ్లడానికి కాలువలను ఏర్పాటు చేసి నీటిని పిల్ల కాలువలోకి మళ్ళించాలని కోరుతున్నారు. లేనిపక్షంలో పంట పొలాలు కూడా దెబ్బతినే అవకాశం ఉందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.
ఇదీ చదవండి: ఉగ్ర గోదావరి ఉరకలేస్తోంది.. వరద ముంచెత్తుతోంది!