ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మమ్మల్ని విస్మరించారు.. అందుకే ఓడారు! - మందకృష్ణ మాదిగ

మాదిగలను విస్మరించినందుకే ఎన్నికల్లో తెదేపా ఓటమి పాలైందని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అభిప్రాయపడ్డారు. జూలై 7న ప్రకాశం జిల్లా ఈడుముడిలో ఎమ్మార్పీఎస్ మహాసభ నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ

By

Published : May 29, 2019, 7:40 PM IST

ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ
గత 20 ఏళ్లుగా ఎమ్మార్పీఎస్ ఎస్సీ వర్గీకరణపై పోరాటం చేస్తోందని సమితి నాయకుడు మందకృష్ణ మాదిగ చెప్పారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో విలేకరులతో మాట్లాడారు. ఐదేళ్ల పాలనలో తెదేపా ప్రభుత్వం మాదిగలను విస్మరించడమే ఆ పార్టీ ఓటమికి కారణమని అభిప్రాయపడ్డారు. 2019 ఎన్నికల్లో నాలుగు లోక్​సభ స్థానాలను ఎస్సీలకు కేటాయించాలని కోరినా తెదేపా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. జూలై 7వ తేదీన ప్రకాశం జిల్లా ఈడుముడిలో ఎమ్మార్పీఎస్ మహాసభ నిర్వహిస్తున్నామని చెప్పారు. జూన్ 5 నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మార్పీఎస్ నాయకులు పాదయాత్రలు చేపడతారని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details