మహిళల ఆర్ధిక భరోసాకు సీఎం జగన్ అండగా ఉంటారని ఎమ్మెల్యే ఆర్.కే. రోజా చెప్పారు. పుత్తూరు మున్సిపాలిటిలో 14 వ ఆర్థిక సంఘం నిధులతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఆమె శంఖుస్థాపన చేశారు. రూ. 10 లక్షల వ్యయంతో చిన్నసుబ్బరాయుడు కండ్రిగ, రూ.7 లక్షలతో కుందిమాకుల గుంట, రూ.20 లక్షలతో వినాయకపురం రోడ్డు, రూ. 20 లక్షలతో బీడీకాలనీ సీ.సీరోడ్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు.
ఎన్నికల వరకే పార్టీలకు ప్రాధాన్యత ఇస్తున్నామని.. తరువాత ప్రజల అభివృద్ధే ధ్యేయం అని తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో.. ప్రతి లబ్ధిదారునికి న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి, డీ.ఈ.సంజీవ కుమార్.. పాల్గొన్నారు.