చిత్తూరు జిల్లా ఏకాంబరకుప్పంలో పవర్ లూమ్ వీవింగ్ మెషిన్లలో అత్యాధునిక సదుపాయాలతో కూడిన మెషిన్లతో యూనిట్‌ను, శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వాటిని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రారంభించారు.
వస్త్ర ఉత్పత్తి రంగంలో ఒక నూతన అధ్యాయానికి ఈ సాంకేతికత నాంది పలుకుతుందని అన్నారు. అత్యాధునిక టెక్నాలజీ తో కూడిన జెకార్డ్ మెషీన్లతో పవర్ లూమ్స్ కలిపి వీవింగ్ చేయడం వలన ఉత్పత్తి, నాణ్యతా సామర్థ్యం పెరుగుతుందని రోజా అన్నారు. అంతేకాకుండా వీవర్స్‌కు ఆదాయం రెట్టింపు అవుతుందని తెలిపారు.