చిత్తూరు జిల్లా పుత్తూరులో విధుల్లో ఉన్న 80 మంది పోలీస్ సిబ్బందికి ఎమ్మెల్యే రోజా.. నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 25 కేజీల బియ్యం, కేజీ కంది పప్పు, వంట నూనె, ఉల్లిగడ్డలు, టమోటాలు అందజేశారు. కరోనా కట్టడి చర్యల్లో నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు సాయం చేయడం ఆనందంగా ఉందన్నారు. ప్రజలకు సీఎం జగన్ రక్షణ కల్పిస్తున్నారని అన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు సలహాలు తీసుకోవాల్సిన అవసరం సీఎంకు లేదని వ్యాఖ్యానించారు.
పోలీసులకు సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రోజా - చిత్తూరులో ఎమ్మెల్యే రోజా నిత్యావసర సరుకుల పంపిణీ
లాక్ డౌన్ విధుల్లో ఉన్న పోలీసులకు ఎమ్మెల్యే రోజా.. నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
MLA roja distributes essential commodities to the police at puthuru in chittoor