కరోనా సెకండ్ వేవ్‌లో కేసులు పెరుగుతున్నందున ప్రతీ ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా ప్రజలకు సూచించారు. కరోనా కట్టడిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
పుత్తూరులో కేసులు పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలన్నారు. రాబోయే 2 నెలల పాటు కొవిడ్ నియంత్రణపై దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు కరోనా కట్టడిలో భాగస్వాములు కావాలన్నారు.