ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగన్ సైన్యంలో చిత్తూరు జిల్లా కీలకం - jagan team

వైఎస్ జగన్‌ తన మంత్రివర్గంలో అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం కల్పించారు. సీనియర్లకు ప్రాధాన్యతనిచ్చారు. మొదటి నుంచీ పార్టీకి విధేయులుగా ఉన్న వారికి మంత్రివర్గ కూర్పులో చోటు దక్కింది.

చిత్తూరు జిల్లా మంత్రులు

By

Published : Jun 8, 2019, 8:40 AM IST

చిత్తూరు జిల్లా పుంగనూరు నుంచి గెలుపొందిన సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మంత్రి పదవి వరించింది. ఎంఏ పీహెచ్​డీ చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి... ఇప్పటి వరకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాజశేఖరరెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు. తాజాగా 2019లో విజయం సాధించి... జగన్‌ జట్టులో సభ్యుడయ్యారు.

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
నియోజకవర్గం:పుంగనూరు
వయస్సు: 67
విద్యార్హత:ఎంఏ, పీహెచ్‌డీ (సోషియాలజీ)
రాజకీయ అనుభవం: ఆరు సార్లు ఎమ్మెల్యే, వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మంత్రి.

గంగాధర నెల్లూరు నుంచి విజయం సాధించిన నారాయణస్వామికి మంత్రి పదవి దక్కింది. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తొలుత 2004లో సత్యవేడు నుంచి శాసనసభ్యుడిగా గెలిచి... 2014, 2019లో గంగాధర నెల్లూరు నుంచి పోటీ చేసి విజయం సాధించారు.

కె.నారాయణస్వామి
నియోజకవర్గం:గంగాధర నెల్లూరు
వయస్సు:51
విద్యార్హత:బీఎస్సీ
రాజకీయ అనుభవం:రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు

ABOUT THE AUTHOR

...view details