కేంద్రమంత్రి పీయూష్ గోయల్ సతిసమేతంగా తిరుమల వెంకటేశ్వరున్ని ఈరోజు ఉదయం దర్శించుకున్నారు. తిరుపతికి వచ్చిన ప్రతిసారీ దేశ సేవచేసేందుకు తనలో నూతనోత్తేజం నిండుకుంటోందన్నారు.
తిరుపతిలో పీయూష్ గోయల్ - tirupathi
కేంద్ర రైల్వే, బొగ్గు గనుల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఉదయం తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. యువతకు మంచి భవిష్యత్తు ఉండాలని... పుల్వామా ఘటనలలో అమరులైన సైనికుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ప్రార్థించినట్లు తెలిపారు.
పీయూష్ గోయల్
తితిదే అధికారులు కేంద్రమంత్రికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో గోయల్ దంపతులకు పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. లోక్‌సభ డిప్యూటీ స్వీకర్ తంబిదొరై వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. యువతకు మంచి భవిషత్తు ఉండాలని... పుల్వామా ఘటనలలో అమరులైన సైనికుల కోసం స్వామివారిని ప్రార్థించినట్లు పీయూష్ తెలిపారు.
Last Updated : Feb 22, 2019, 11:33 AM IST