మహాశివరాత్రి పురస్కరించుకొని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో స్వామి, అమ్మవార్లకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పట్టు వస్త్రాలను సమర్పించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య మంత్రికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆలయ ఆవరణలోని మణికంఠ ఆలయం నుంచి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, ఆలయ ఈవో పెద్దిరాజుతో కలిసి సారెగా తీసుకుని ఆలయంలోని స్వామి, అమ్మవార్ల అలంకార మండపంలో వేదపండితులకు అందజేశారు. అనంతరం ధ్వజస్తంభంపై సూక్ష్మ నంది విగ్రహానికి స్వర్ణ తాపడాన్ని మంత్రి విరాళంగా అందజేశారు.
పట్టువస్త్రాలను సమర్పించిన మంత్రి పెద్దిరెడ్డి - మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాజా వార్తలు
మహాశివరాత్రి పురస్కరించుకొని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని స్వామి, అమ్మవార్లకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పట్టువస్త్రాలను సమర్పించారు.
minister peddireddy