రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల ఏర్పాటు చేయడమే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ధ్యేయమని పరిశ్రమల శాఖా మంత్రి మేకపాటి గౌతంరెడ్డి అన్నారు. రేణిగుంట విమానాశ్రయం సమీపంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బిజినెస్ సెంటర్ ను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఐటీ హబ్ సమీపంలో ఉన్న సెల్ కాన్ చరవాణి ఉత్పత్తి కంపెనీని పరిశీలించారు. త్వరలో జిల్లాకు రెండు కొత్త కంపెనీలు వస్తున్నాయని... వాటిలో దాదాపు పదివేల మంది స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు. గత ప్రభుత్వం ఎన్నికల ముందు కంపెనీలు రాకముందే ఆర్భాటంగా భూమి పూజలు నిర్వహించిందని ఆరోపించారు. పరిశ్రమల ఏర్పాటు కోసం భూములు ఇచ్చిన వారికి ఉద్యోగ అవకాశాల్లో ప్రథమ ప్రాధాన్యత ఉంటుందన్నారు.
చిత్తూరులో ఐటీ కేంద్రాన్ని ప్రారంభించిన పరిశ్రమల మంత్రి - పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతంరెడ్డి
చిత్తూరు రేణిగుంట విమానాశ్రయ సమీపంలోని ఐటీ బిజినెస్ సెంటర్ ను పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ప్రారంభించారు.
చిత్తూరులో ఐటీ సెంటర్ ప్రారంభించిన పరిశ్రమల మంత్రి