చిత్తూరు జిల్లా గంగవరం మండలం నడిమి గొర్రెలదొడ్డి గ్రామంలో వినాయకమ్మ(40) అనే మహిళ అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. భర్త నాగరాజు వేధింపులు భరించలేక బలన్మరణానికి పాల్పందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసులు సమాచారం ప్రకారం...వినాయకమ్మ, నాగరాజు కొంత కాలం నుంచి గొడవలు పడుతున్నారు. ఈ కలహాలు తీవ్రమై ఇంట్లో ఎవరూ లేని సమయంలో వినాయకమ్మ ఎలుకల మందు తిని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆమెను పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా...అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు తెలిపారు. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వినాయకమ్మ, నాగరాజు దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు.
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య - nadimi gorreladoddi, chittoor district
కుటుంబ కలహాలతో చిత్తూరు జిల్లా నడిమి గొర్రెలదొడ్డిలో వివాహిత ఎలుకల మందు తిని బలన్మరణానికి పాల్పడింది. మృతురాలి బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య