చిత్తూరు జిల్లా పెద్దమండ్యం మండలం దేనినాయక్ తండలో మారెమ్మ తల్లి జాతర వైభవంగా జరిగింది. రెండు రోజులుగా జరుగుతున్న ఈ వేడుకకు రాయలసీమలో పలుజిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కదిరి, రాయచోటి, తంబళ్లపల్లె పరిధిలో నివసిస్తోన్న సుగాలి తెగ గిరిజనులు అత్యంత వైభవంగా భక్తిశ్రద్ధలతో మారెమ్మ జాతరను నిర్వహిస్తారు.
వైభవంగా మారెమ్మ తల్లి మహోత్సవం - సుగాలి తెగ
సుగాలి తెగ గిరిజనుల ఆరాధ్య దైవం తంబళ్లపల్లె మారెమ్మ తల్లి జాతర వైభవంగా జరిగింది. ఈ వేడుకకు చిత్తూరు జిల్లాలోని పలుప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.
వైభవంగా మారెమ్మ తల్లి మహోత్సవం
మంగళవారం రాత్రి అమ్మవారి ఊరేగింపు చేశారు. ఈ సందర్భంగా భక్తులు బంజారా సంప్రదాయ నృత్యాలు చేశారు. గిరిజన మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించారు.
ఇవీ చూడండి : పట్టాలు తప్పిన గూడ్స్... రైళ్ల రాకపోకలకు అంతరాయం