ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైన్స్ షాపు​ ముందు మందుబాబుల ధర్నా.. కారణం తెలిస్తే షాక్​ అంతే..!

Dharna of drunkards: పొద్దుపొద్దున్నే మందుబాబులంతా కలిసి వైన్స్ షాపు​ ముందు ధర్నాకు దిగారు. మా సమస్యకు ఎలాగైనా ఈరోజు పరిష్కారం దొరకాల్సిందే.. అప్పటి వరకు ఇక్కడి నుంచి కదిలేదే లే అంటూ దుకాణం షట్టర్​ మూసేసి కూర్చున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ నినాదాలు చేయడం మొదలెట్టారు. కట్​చేస్తే.. నోరుమూసుకుని ఎవరిళ్లకు వారు వెళ్లిపోయారు.. వయా పోలీస్​స్టేషన్. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..!

Drinkers Dharna
మందుబాబుల ధర్నా

By

Published : Dec 21, 2022, 10:32 PM IST

Dharna of drunkards: తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఐటిపాముల గ్రామంలో మందుబాబులు ధర్నాకు దిగారు. స్థానికంగా ఉన్న శివ సాయి వెంకటేశ్వర మద్యం దుకాణం ఎదుట ఆందోళన చేపట్టారు. మా గోడు ఎవరికీ పట్టదా అంటూ నినాదాలు చేయడం మొదలెట్టారు. వీరి లొల్లి చూసి.. విషయం తెలుసుకుని మనమూ సపోర్ట్​ చేద్దామని వచ్చిన గ్రామస్థులు మన మందుబాబులు చెప్పిన కారణం విని ముక్కున వేలేసుకున్నారు. ఇదేం ధర్నారా బాబు అంటూ వచ్చిన దారినే మళ్లీ వెనక్కి కూడా చూడకుండా వెళ్లిపోయారు.

విషయం తెలుసుకున్న పోలీసులు సీన్​లోకి ఎంట్రీ ఇచ్చారు. ఏమైందయ్యా.. పొద్దు పొద్దున్నే వైన్స్​ ముందు ధర్నాకు దిగారు. చెప్పండి.. ఏంటి మీ ప్రాబ్లమ్ అని అడిగారు. అప్పుడు చెప్పారు మన మందుబాబులు వారి ధర్నాకు కారణమేంటో. ఆ విషయం విని పోలీసులు కూడా ఒకింత ఆశ్చర్యానికి, కొంత అసహనానికి గురయ్యారు.

అంతలోనే తేరుకుని.. ఇందుకోసం కూడా ధర్నాలు చేస్తారా.. సరేలే మీ ప్రాబ్లం గురించి వైన్స్​ వాళ్లతో మాట్లాడదాం.. మీరైతే లేవండి అని సర్దిచెప్పారు. మా డిమాండ్స్​ తీర్చే వరకు లేచేదే లే అంటూ మన మందుబాబులు అలాగే కూర్చోవడంతో ఇక చేసేది లేక వాళ్లందరినీ స్టేషన్​కు తరలించారు. అక్కడ వారి స్టైల్లో సర్దిచెప్పి ఎవరిళ్లకు వారిని పంపించేశారు. అంతా బాగానే ఉంది కానీ.. మందుబాబుల ధర్నాకు కారణమేంటో చెప్పరా బాబు.. అప్పటి నుంచి ఓ ఊరిస్తున్నావ్​.. అని విసుక్కుంటున్నారా.. ఒక్క నిమిషం ఆగండి చెప్పేస్తున్నా..

శివ సాయి వెంకటేశ్వర వైన్స్ (అదేనండీ.. మనోళ్లు ధర్నా చేసిన వైన్స్)​లో అన్ని రకాల మద్యం అందుబాటులో ఉండటం లేదట. కల్తీ మద్యం కూడా అమ్ముతున్నారట. ఈ కారణంతోటే మన మందుబాబులు ధర్నాకు దిగారు. అధికారులు వెంటనే స్పందించి వైన్స్​పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న కట్టంగూరు ఎస్సై విజయ్ కుమార్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని వారిని స్టేషన్​కు తరలించి సర్దిచెప్పి పంపారు.

ఇవీ చూడండి..

ABOUT THE AUTHOR

...view details