ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాల్సిన వాలంటీరు... నాటు సారా దందాలో అతని తండ్రితో సహా పోలీసులకు పట్టుబడ్డాడు. తిరుపతిలోని అలిపిరి పోలీసులకు అందిన రహస్య సమాచారం మేరకు దాడులు చేయగా.. జీవకోన సమీపంలోని పార్వతీనగర్లో వాసు అనే వార్డు వాలంటీర్ ఇంట్లో 15 బేరళ్ల నాటు సారా, సారా తయారికి వాడే ముడి సరుకులు బయటపడ్డాయి. వాటిని స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ పోలీసులు.. వాలంటీర్తో పాటు అతని కుటుంబ సభ్యలపైనా కేసు నమోదు చేశారు. గత రెండు నెలలుగా నాటుసారా కాస్తున్నట్టు గుర్తించామని పోలీసులు తెలిపారు.
పోలీసులకు చిక్కిన వార్డు వాలంటీర్.. నాటుసారా గుట్టురట్టు - man arrested for preparing natusara at thirupathi
నాటు సారా దందాలో.. వార్డు వాలంటీరును పోలీసులు రెడ్ హాండెడ్ గా పట్టుకున్నారు. పెద్ద మొత్తంలో సారాతో పాటు.. ముడి సరుకును స్వాధీనం చేసుకున్నారు.
man arrested for preparing natusara at jeevakona in thirupathi