చిత్తూరు జిల్లా సత్యవేడు పారిశ్రామిక వాడలో వలసకూలీల జీవితాలు దుర్భరంగా మారాయి. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి నిరాశ్రయులమయ్యామని వారు వాపోతున్నారు. ప్రభుత్వం తరపున అన్ని ఇస్తున్నామని అధికారులు చెబుతున్నా... తమకేమీ అందడం లేదని కూలీలు ఆవేదన చెందుతున్నారు.
లాక్డౌన్ ఎఫెక్ట్: దుర్భరంగా వలస కూలీల జీవితాలు
లాక్డౌన్ కారణంగా చిత్తూరు జిల్లా సత్యవేడు పారిశ్రామిక వాడలో వలసకూలీల జీవితాలు దుర్భరంగా మారాయి. ప్రభుత్వం తరపున అన్ని ఇస్తున్నామని అధికారులు చెబుతున్నా... తమకేమీ అందడం లేదని కూలీలు ఆవేదన చెందుతున్నారు.
50 రోజులుగా పరిశ్రమల వద్ద ఎలాంటి పనులు లేక పోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకొచ్చిన గుత్తేదారులు చేతులెత్తేశారు. దీంతో వలస కూలీలు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వలస కూలీలు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో మాత్రం ఆలస్యం జరగడం ఏంటని కూలీలు ప్రశ్నిస్తున్నారు. తమను ఇక్కడికి తీసుకొచ్చిన గుత్తేదారులు పట్టించుకోకపోగా... ఇక్కడి నుంచి వెళ్లాలంటే పరిశ్రమ నుంచి అంగీకార పత్రాన్ని తీసుకురావాలని చెబుతున్నారని విచారం వ్యక్తం చేశారు. పరిశ్రమ నిర్వాహకులు మాత్రం దీనిపై స్పందించడం లేదన్నారు.
వలస కార్మికులు ఆందోళనపై శ్రీసిటీ డీఎస్పీ విమలకుమారిని వివరణ కోరగా... 10 రోజుల్లో అందరిని స్వస్థలాలకు పంపించే ప్రయత్నం చేస్తున్నట్లు ఆమె తెలిపారు.