ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మదనపల్లిలో భూవివాదం... ఇరు వర్గాల మధ్య ఘర్షణ - మాజీ ఎంపీపీ

చిత్తూరు జిల్లా మిట్టామర్రివాండ్ల పల్లెలో చెలరేగిన భూవివాదం.. ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. గ్రామానికి చెందిన తమ పొలాన్ని మాజీ ఎంపీపీ భర్త దౌర్జన్యంగా లాక్కోవాలని చూస్తున్నాడని ఓ రైతు కుటుంబీకులు ఆరోపించారు. అయితే.. రైతు కుటుంబ సభ్యుల్లోనే ఒకరు తనకు పొలం అమ్మారని ఎంపీపీ భర్త ప్రతి ఆరోపరణలు చేయగా.. ఇరువురూ పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.

మదనపల్లిలో భూవివాదం...ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి

By

Published : Jun 29, 2019, 10:40 PM IST

మదనపల్లిలో భూవివాదం...ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి

చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం మిట్టామర్రి వాండ్ల పల్లెలో భూ వివాదం ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. గ్రామానికి చెందిన వెంకట రమణా రెడ్డి.. తన పొలంలో టమోటో పైరు వేసుకోగా.... ఈ స్థలం తనకు తనదని మదనపల్లె మాజీ ఎంపీపీ సుజన భర్త బాల కృష్ణారెడ్డి, మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి వాగ్వాదానికి దిగారు. ట్రాక్టర్​తో... పొలాన్ని దున్నే ప్రయత్నం చేశారు. వారిని వారించే ప్రయత్నం చేయగా... ఎంపీపీ మనుషులు తమపై దాడి చేశారని వెంకటరమణా రెడ్డి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనలో వెంకట రమణా రెడ్డి గాయపడ్డారు. ఆగ్రహించిన కుటుంబ సభ్యులు ఎంపీపీ కారుని ధ్వంసం చేశారు.

విషయం తెలుసుకుని మదనపల్లి గ్రామీణ పోలీసులు సంఘటనా స్థలిని పరిశీలించారు. విచారణలో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారని పోలీసులు తెలిపారు. గ్రామంలో వెంకట రమణా రెడ్డి అన్నదమ్ములకు 15 ఎకరాల భూమి ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. వారి నుంచి తాము పొలాన్ని కొనుగోలు చేశామని మాజీ ఎంపీపీ భర్త బాలకృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘర్షణలో గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి : హోటల్​లోకి లారీ.. ముగ్గురు మహిళల మృతి

ABOUT THE AUTHOR

...view details