ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైభవంగా శ్రీ పురందరదాసు ఆరాధనా మహోత్సవాలు - శ్రీ పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు తాజా సమాచారం

తితిదే, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో కర్ణాటక సంగీత పితామహుడు శ్రీ పురందరదాసు ఆరాధనా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మూడు రోజుల పాటు జరగనున్న ఈ ఆరాధనోత్సవాలలో భాగంగా... ఇవాళ పుష్పాంజలి ఘటించారు.

karnataka music fame Sri Purandaradasa aaradhanotsavalu
వైభవంగా శ్రీ పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు

By

Published : Feb 11, 2021, 7:07 PM IST

కర్ణాటక సంగీత పితామహుడు శ్రీ పురందరదాసు ఆరాధనా మహోత్సవాలు తితిదే, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భజన మండలి సభ్యులు తరలి వచ్చారు.

వీరంతా తొలుత అలిపిరి సమీపంలో ఉన్న పురందరదాసు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విగ్రహం వద్ద మండలి సభ్యులు పురందరదాసు కీర్తనలను ఆలపించారు. ఏటా భారీగా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని.. కరోనా కారణంగా ఈ ఏడాది తక్కువ మందితో నిర్వహించామని తితిదే అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details